*మృతుడి కుటుంబానికి అండగా బిల్లా యాదగిరి*

ప్రజా గొంతుక మార్చి 31 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:
వేలేరు మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబ సభ్యుడు సారా శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, మంగళవారం ఆయన కుటుంబాన్ని వేలేరు సర్పంచ్ బిల్లా యాదగిరి పరామర్శించి కుటుంబానికి ఆర్థిక సహాయంగా 5,000 అందించారు.
ఈ సందర్భంగా బిల్లా యాదగిరి మాట్లాడుతూ, కుటుంబానికి పెద్దదిక్కైన శ్రీనివాస్ మరణించడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా కూడా కుటుంబానికి సహాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ శ్రీకర్, గౌడ కుల సంఘ అధ్యక్షులు కుమారు, సంఘ పెద్దలు చిరంజీవి, రమేష్, వెంకటేశ్, వీరన్న, లక్ష్మీనారాయణ, రవి, రాజశేఖర్, శ్రీను, అలాగే గ్రామ పెద్దలు రాజయ్య, సునీల్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు…
Post Views: 49











