ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 02 ఏప్రిల్ 2026.
ప్రజాపాలన , ప్రగతి ప్రణాళిక లో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.
ఖానాపూర్ మండలం బుధరావుపేట లో పాల్గొన్న ఎమ్మెల్యే
ఈ సందర్భంగా 98 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేత.
ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ , బుధరావుపేట గ్రామంలో 47 ఇండ్లు మంజూరు చేసి వివిధ దశల్లో ఉన్నాయని , అదే విధంగా 244 కొత్త రేషన్ కార్డులు అందించామని తెలిపారు.
గతంలో 2014 కి ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు బుధరావుపేట గ్రామంలో 13 ఎకరాలు ప్రైవేట్ భూమిని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి ఇండ్ల స్థలం లేని పేదలకు ఇంటి స్థలం అందించామని , ఇప్పుడు ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని అన్నారు.
త్వరలో నూతన పింఛన్లు కూడా మంజూరు చేస్తామని తెలిపారు.
ప్రస్తుతం నడుస్తున్న పథకాలు అన్ని దాదాపు గతంలో కాంగ్రెస్ హయాంలో అమలు చేసినవేనని , ఆనాడు, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేదల సంక్షేమానికి కట్టుబడి పని చేసే ప్రభుత్వం అన్నారు.
ఈ కార్యక్రమంలో సభాధ్యక్షురాలు, బుధరావుపేట సర్పంచ్ పెసరు రాణి గోవర్ధన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి , ఆర్డీవో ఉమారాణి ,మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ హరిబాబు , జిల్లా మైనారిటీ అధికారి రమేష్ , డీఏంహెజ్ఓ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.











