ఈస్టర్ పండుగ వేళ సింగరేణి కార్మికులకు జీఎం శుభాకాంక్షలు

ప్రజా గొంతుక న్యూస్, ఏప్రిల్ 05/ భద్రాద్రి కొత్తగూడెం:
సింగరేణి కాలరీస్ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేమ్ రాజ్ ఆదివారం ఈస్టర్ పండుగను పురస్కరించుకుని కొత్తగూడెం ఏరియాలో పనిచేస్తున్న క్రైస్తవ సోదరులకు, కార్మికులకు మరియు వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యేసుక్రీస్తు పునరుత్థానానికి సంకేతమైన ఈస్టర్ పండుగ మానవాళికి నిరీక్షణ, శాంతి మరియు సోదరభావాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. కొత్తగూడెం ఏరియా పరిధిలోని వివిధ విభాగాల్లో నిరంతరం శ్రమిస్తున్న కార్మికులందరి జీవితాల్లో ఈ పండుగ వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.
సింగరేణి అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, పండుగ పూట ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని కోరుతూ జీఎం శుభాకాంక్షలు అందజేశారు.











