నిలువుటద్దం ఎడిటర్ కు నివాళులు అర్పించిన కర్క నాగరాజు

హైదరాబాద్ ఏప్రిల్ 05 ( ప్రజా గొంతుక )
కూకట్పల్లి సీనియర్ పాత్రికేయుడు నిలువుటద్దం ఎడిటర్ ఎడ్లపల్లి నాగరాజు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని కూకట్పల్లి నియోజకవర్గం నుండి నియోజకవర్గం ఐ.ఎన్.టి.యు.సి అధ్యక్షులు,హిందూస్తాన్ ఏరోనాటిక్స్ వర్కర్స్ యూనియన్ కర్క నాగరాజు ప్రధమ వర్ధంతి కార్యక్రమం లో పాల్గొని నాగరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘణంగా నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ…. నిలువుటద్దం పత్రికను స్థాపించి కూకట్పల్లి పత్రికా రంగంలో కొత్త చరిత్రను సృష్టించారు.
స్థానిక రాజకీయాల గురించి, స్థానిక సమస్యలపైన ఎప్పుడూ నిలువుటద్దం పత్రికా ముందుండేది అని పత్రిక రంగానికి నాగరాజు చేసిన సేవలు వెలకట్టలేము అని బౌతికంగ వారు మన మధ్యలేకపోయిన వారి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచి పోతాయని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హిందూస్తాన్ ఏరోనాటిక్స్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె.సురేష్, జాయింట్ సెక్రెటరీస్ వడ్డే నాగార్జున, పోలేపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.











