*ఈస్టార్” యేసు క్రీస్తూ సమాధి గెలిచిన రోజు*
* *యేసు క్రీస్తూ సమాధి ఒక్కటే ఖాళీ నేటికీ సజీవ సాక్షం*
బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్
ప్రజా గొంతుక న్యూస్,(ఏప్రిల్ 06)సూర్యాపేట: 4వ వార్డు ఖాసీంపేట బేతెస్థ ప్రార్ధన మందిరం లో ఘనంగా ఈస్టార్ ఆరాధనా కార్యక్రమం బేతెస్థ డైరెక్టర్ దుర్గం కరుణ శ్రీ (హెప్సిబా ) నిర్వహించగా ఈ సందర్బంగా బిషప్ దుర్గం ప్రభాకర్ ఈస్టార్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ ఉపవాస దినాలలో బైబిల్ ను పూర్తిగా చదివిన నలుగురు సంఘ సభ్యులకు మెమోంటో బహుకరించడం జరిగింది. అనంతరం క్రీస్తూ బోధనలు చేస్తూ పునరుత్థానాన్ని మరణంపై యేసు గెలిచిన విజయోత్సవంగా యేసుక్రీస్తు పునరుత్థానాన్ని క్రైస్తవులు ఈస్టర్ పండుగగా జరుపుకుంటారనీ కేధలిక్కులు పెంతుకోస్తులు లూధరన్ బైబిలు మిషను వారు జరుపుకునే శిలువధ్యానాలు భస్మ బుధవారం తో ఆరంభమై ఈస్టర్ రోజుతో ముగిస్తుందనీ పవిత్ర బైబిల్ యేసుక్రీస్తు పునరుత్థానానికి దారితీసిన సంఘటనలను వివరిస్తుందనీ విశ్వాసులకు గొప్ప, శక్తివంతమైన ఈస్టర్ గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తు శిలువ వేయడంతో ప్రారంభమవుతుందనీ అప్పుడు అతను తన ఆత్మను విడిచిపెట్టి మరణించి తిరిగి మూడో రోజు సమాధినుండి లేవడం జరిగిందనీ యేసు క్రీస్తూ సమాధి చూడటానికి వచ్చిన స్త్రీలకు రాయి దొర్లినట్లు, సమాధి ఖాళీగా ఉందని వారు కనుగొన్నారు అకస్మాత్తుగా ఇద్దరు దేవదూతలు వారికి కనిపించి”మీరు చనిపోయినవారిలో జీవించి ఉన్నవారి కోసం ఎందుకు చూస్తున్నారు? అతను ఇక్కడ లేడు, అతను లేచాడు!” (లూకా 24:5-6) అని చెప్పడం జరిగిందనీ స్త్రీలు ఏమి జరిగిందో చెప్పడానికి శిష్యుల వద్దకు త్వరపడి తిరిగి వచ్చారనీ యేసు స్వయంగా శిషులకు కనిపించి అతను తన చేతులు కాళ్ళపై ఉన్న గాయాలను వారికి చూపించాడనీ వారితో భోజనం చేశాడు అతను నిజంగా జీవించి ఉన్న వ్యక్తి అని నిరూపించాడనీ యేసును మళ్లీ చూసినందుకు శిష్యులు ఎంతో సంతోషించారు ఆయనపై వారి విశ్వాసం పునరుద్ధరించబడింది అత్యంత ప్రసిద్ధ ఈస్టర్ శ్లోకం, “క్రీస్తు ప్రభువు ఈ రోజు లేచాడు”, ప్రపంచంలోని అనేక చర్చిలలో పాడతారు మతపరమైన ఆచారాలతో పాటు ఈస్టర్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు గొప్ప ప్రాముఖ్యత యేసుక్రీస్తు పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి మూలస్తంభం దాని ఆశ కొత్త జీవితం యొక్క సందేశం ప్రతిచోటా విశ్వాసులకు ఓదార్పు ప్రేరణ యొక్క మూలం అనీ అన్నారు.ఈ కార్యక్రమం లో రాజు,తీతు, అబ్రాహాము, బాబు,రమేష్, యేసుపాదం, వెంకన్న, సురేష్, లాజర్, ఉపేందర్, కిరణ్, జానయ్య,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు











