పూలే ,అంబేడ్కర్ మహనీయుల జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి
2026 ఏప్రిల్ 05 నుండి 21వరకు
కర పత్రాన్ని ఆవిష్కరించిన సిఐ సతీష్ రెడ్డి….. ఎస్ఐ సాయి ప్రశాంత్…..మరియు ఎస్ఎఫ్ఐ నాయకులు
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:09
హాలియా భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో నిర్వహించే పూలే ,అంబేద్కర్ జయంతి ఉత్సవాల కలపత్రాన్ని ఆవిష్కరించి అనంతరం వారు మాట్లాడుతూ సామాజిక న్యాయం, అందరికీ విద్య, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహనీయులు
జ్యోతిరావు పూలే డా. బి.ఆర్.అంబేడ్కర్
జయంతిల సందర్భంగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు, వారి స్ఫూర్తితో గంజాయి డ్రగ్స్ నిర్మూలిద్దాం.. బెట్టింగ్ యాప్స్ వ్యతిరేకిద్దాం నినాదం తో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కమిటీ నిర్వహించడం అభినందనీయమన్నారు నేటి సమాజంలో విద్యార్థి, యువతను బలహీన పరుస్తున్న అతి పెద్ద శత్రువు గంజాయి డ్రగ్స్ అన్నారు డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్లు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నాయి. ఈ సాంకేతిక అభివృద్ధిని ఉపయోగించుకొని కొన్ని సంస్థలు బెట్టింగ్ యాప్స్ రూపంలో విద్యార్థి,యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి అని అన్నారు
మొదట సరదాగా మొదలైన ఈ రెండు సమస్యలు విద్యార్థి యువత భవిష్యత్తు జీవితాన్ని నాశనం చేసే ప్రమాదకరమైన అలవాట్లు కావున వీటికి వ్యతిరేక ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో పూలే, అంబేద్కర్ మహానీయుల జయంతిల సందర్భంగా అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులను ప్రజలను యువతలను చైతన్య పరచాలని సంకల్పంతో నిర్వహిస్తున్నామని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు నల్లబెల్లి జగదీష్ కోరే రమేష్ ధనుష్ తదితరులు పాల్గొన్నారు











