ఆస్తి పన్ను సకాలంలో చెల్లించి 5 శాతం రాయితీ పొందండి…..
ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి
మున్సిపల్ కమిషనర్
హాలియా మున్సిపాలిటీ
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:10
హాలియా మున్సిపాలిటీ
నల్గొండ జిల్లా
2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్ను 5 శాతం రాయితీ ఇంకా 20 రోజులు మాత్రమే ఉన్నదిహాలియా మున్సిపాలిటీ పరిధిలోని పౌరులందరికీ తెలియజేయునది ఏమనగా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి ఆస్తి పన్నును ముందుగా చెల్లించే వారికి రాష్ట్ర ప్రభుత్వం5 శాతం రాయితీ ను ప్రకటించింది. ఈ రాయితీ 01-04-2026 నుండి 30-04-2026 వరకు మాత్రమే వర్తిస్తుంది మరియు
హాలియా మున్సిపాలిటీ వాహనల ద్వారా మైక్ అనౌన్స్ మెంట్ మరియు మునిసిపల్ వాహనాలకు 5 శాతం రాయితీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయించి ప్రచారం చేయించడం జరుగుతుంది. అదేవిధంగా 5 శాతం రాయితీ ఫ్లెక్సీలను ప్రధాన కూడళ్ళలో, మెయిన్ రోడ్స్ మీద ఏర్పాటు చేయటం జరిగింది.
5శాతం రాయితీ వల్ల కలుగు లాభాలు
1000 రూపాయలు ఉన్న ఇంటి పన్ను 950/-రూపాయలు మాత్రమే కట్టుకోబడును
10000/- రూపాయల ఇంటి పన్ను ఉన్నవారు 9500/-రూపాయలు మాత్రమే కట్టుకోబడును
50000/-రూపాయల ఇంటి పన్ను ఉన్నవారు 47500/-రూపాయలు మాత్రమే కట్టుకోబడును
కావున హాలియా మున్సిపాలిటీ గృహ యజమానులు మరియు వాణిజ్య సముదాయలు 5 శాతం రాయితీని వినియోగించుకోగలరని కోరుచున్నాము
మరిన్ని వివరాలకు మున్సిపల్ కార్యాలయాన్ని లేదా సంబంధిత బిల్ కలెక్టర్‌ను సంప్రదించగలరు.











