E-PAPER

వడదెబ్బతో కూలీ మృతి – భీమదేవరపల్లి మండలంలో విషాదం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

వడదెబ్బతో కూలీ మృతి – భీమదేవరపల్లి మండలంలో విషాదం

11 Apr 2026, 1:51 pm DISHA POWER

వడదెబ్బతో కూలీ మృతి – భీమదేవరపల్లి మండలంలో విషాదం

భీమదేవరపల్లి:-

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.ఎండల తీవ్రతకు వడదెబ్బ తగిలి బరిగల శోభ (45) అనే మహిళా కూలీ ప్రాణాలు కోల్పోయారు.గట్ల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బరిగల శోభ, కూలీ పని నిమిత్తం పొరుగునే ఉన్న ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామానికి వెళ్లారు. అక్కడ పువ్వులు దులిపే పని ముగించుకుని, సాయంత్రం తిరిగి ట్రాక్టర్‌లో స్వగ్రామానికి బయలుదేరారు.ప్రయాణ సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ట్రాక్టర్ డబ్బాలోనే శోభ స్పృహతప్పి పడిపోవడంతో గమనించిన తోటి కూలీలు వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరీక్షించగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తీవ్రమైన వడదెబ్బ కారణంగానే ఈ మృతి సంభవించినట్లు సిబ్బంది ప్రాథమికంగా వెల్లడించారు.

మృతురాలికి సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులకు చేరవేశారు. గ్రామంలో కష్టపడి పనిచేసే మహిళ ఇలా అకస్మాత్తుగా మరణించడంతో గట్ల నర్సింగాపూర్ గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!