అక్రమ మద్యం విక్రయం బట్టబయలు – పహాడీషరీఫ్ పోలీసులు.
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 11:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయం జరుగుతున్నట్లు లభించిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు.ఈ మేరకు క్రైమ్ నంబర్ 189/2026గా తెలంగాణ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 34(A) కింద కేసు నమోదు చేయబడింది.సబ్‌ఇన్‌స్పెక్టర్ వి.లక్ష్మయ్య ఆధ్వర్యంలో పోలీస్ బృందం పహాడీషరీఫ్‌లోని అక్బర్ ఫంక్షన్ హాల్ ఎదుట ఉన్న సుభాష్ కిరాణా షాప్‌పై దాడి నిర్వహించారు.ఈ దాడిలో కలివాల నరేష్ (50 సంవత్సరాలు) అనే వ్యక్తి అనుమతి లేకుండా అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.మధ్యవర్తుల సమక్షంలో నిర్వహించిన తనిఖీలలో క్రింది మద్యం సీజ్ చేయబడింది:
గుడ్ ప్రెస్టీజ్ విస్కీ (180 మి.లీ) – 12 బాటిళ్లు
ఆఫీసర్స్ చాయిస్ విస్కీ (90 మి.లీ) – 20 బాటిళ్లు
ఐబి (90 మి.లీ) – 15 బాటిళ్లు మొత్తం: 47 బాటిళ్లు (సుమారు 7.2 లీటర్లు)
దర్యాప్తులో భాగంగా నిందితుడు వైన్ షాపుల నుండి మద్యం కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమ లాభాలు పొందుతున్నట్లు వెల్లడైంది.నిందితుడిని అదుపులోకి తీసుకుని,సీజ్ చేసిన మద్యాన్ని పంచనామా నిర్వహించి భద్రపరిచారు.నమూనాలను రసాయన పరీక్షల కోసం పంపించారు.పహాడీషరీఫ్ పోలీసులు అక్రమ మద్యం విక్రయాలు,రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని,ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.ఇన్‌స్పెక్టర్ ఆఫ్
పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్











