*బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం పూలే
ప్రజా గొంతుక ఏప్రిల్ 11 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:
సమానత్వ సమాజ స్థాపనకు మహాత్మ జ్యోతిరావు పూలే చూపిన మార్గం భవితరాలకు స్ఫూర్తిదాయకమని పలువురు నాయకులు పేర్కొన్నారు. ధర్మసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న పూలే విగ్రహం వద్ద ఆయన 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శాంతి సాగర్ మాదిగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి గంగారపు శ్రీనివాస్ మాదిగ, గ్రామ సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా తదితరులు పూలమాలలు వేసి మహాత్మునికి ఘన నివాళులుఅర్పించారు.అనంతరం జరిగిన సమావేశంలో గంగారపు శ్రీనివాస్ మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే బడుగు, బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతికై నిరంతరం పోరాడిన మహనీయుడని కొనియాడారు. కులవివక్ష నిర్మూలన కోసం ఆయన చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. సమాన హక్కులు కలిగిన సమాజ నిర్మాణం కోసం పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాచర్ల రవి, మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్, బీజేపీ జిల్లా నాయకులు నిమ్మ సుదర్శన్ రెడ్డి, వీఎహెచ్పీఎస్ మండల అధ్యక్షులు మాచర్ల బాబు, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు సింగారపు పవన్, ప్రధాన కార్యదర్శి చిలుక రాజు, సీనియర్ నాయకులు కొట్టే శివ, పుట్ట దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మండల నాయకులు రిపికా మహేష్,మల్లేపల్లి అనిల్, బొక్క రమేష్, కొట్టె విజయ్ తదితరులు పాల్గొన్నారు….











