పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 11:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో..హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, 11-04-2026 తేదీన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ కాలనీలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమాన్ని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి. లక్ష్మీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో, సెక్టార్ ఎస్‌ఐ శ్రీ లక్ష్మయ్య మరియు జెడ్‌సీసీ హరి చందన సమన్వయంతో నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో శ్రీరామ్ కాలనీ నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజలకు వివిధ రకాల సైబర్ మోసాల గురించి అవగాహన కల్పించారు. ముఖ్యంగా : నకిలీ లింకులు మరియు మోసపూరిత ఫోన్ కాల్స్ (బ్లాక్ మెయిలింగ్ స్కామ్‌లు సహా)
ఓటీపీలు, పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకోవడం వల్ల కలిగే ప్రమాదాలు
సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాలు, ముఖ్యంగా వీడియో కాల్స్ ద్వారా జరిగే సెక్స్టార్షన్ మోసాలు
ఆన్‌లైన్ ఉద్యోగాలు, రుణాలు, బ్యాంకింగ్ మోసాలు
డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు ల గురించి అవగాహనా కల్పించారు
ఈ అవగాహన కార్యక్రమంలో వాస్తవ ఉదాహరణలతో ప్రజలకు వివరించి, మోసగాళ్లు ఎలా అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటారో తెలియజేశారు.
సైబర్ మోసాలకు గురైన వెంటనే గోల్డెన్ అవర్లోనే సమీప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలి లేదా 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు.
పహాడీషరీఫ్ పోలీసులు ప్రజలను సైబర్ నేరాల నుండి రక్షించేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.











