హాలియా ముస్లిం మైనారిటీ జల్సా అవేర్నెస్ ప్రోగ్రామ్ విజయవంతం ……

దైవ మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని మత పెద్దల స్పీచ్….
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:11
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా ప్రాంత ముస్లిం సోదరుల జల్సా అవేర్నెస్ పోగ్రామ్ ఎస్ ఆర్ గార్డెన్ మదారిగూడ రోడ్ హాలియాలో అవేర్నెస్ ప్రోగ్రాం కు చుట్టుపక్కల ముస్లిం సోదరులు అందరూ హాజరు అయ్యారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హైదరాబాద్ వాస్తవ్యులు గయాస్ అహ్మద్ రషాది సహాబ్ ,నల్గొండ వాస్తవ్యులు అబ్దుల్ బషీర్ సహాబ్,మరియు మత పెద్దలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అల్లాహ్ దైవ మార్గంలో నడవాలని మరియు ప్రతి ఒక్క ముస్లిం సోదరులు తప్పకుండా ప్రతి రోజు దైవ ప్రార్థనలు చేయాలని మరియు తెలియని వాళ్లకు మనం నేర్పించాలని తమ,తమ ఊర్లలో ఉన్నటువంటి మజీద్లలో ప్రార్థనలు చేయాలని అన్నారు మరియు మనకు ఉన్న దాంట్లో నిస్సహాయులైన వారికి సహాయం చేయాలని అన్నారు ఈ యొక్క జల్సా కార్యక్రమానికి హాలియా మున్సిపాలిటీ ముస్లిం మైనారిటీ సోదరులు చుట్టూ పక్కల గ్రామాల సోదరులు మరియు మహిళలు పాల్గొన్నారు











