చిన్న నిర్లక్ష్యపు చర్యతో కుటుంబం రోడ్డున పడుతుంది. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, జిల్లా కలెక్టర్ కలెక్టర్ కోయ శ్రీ హర్ష హాజరయ్యారు,

ప్రజా గొంతుక న్యూస్/ సుల్తానాబాద్/ రిపోర్టర్ నూక రాందాసు
చిన్న నిర్లక్ష్యపు చర్యతో రోడ్డు ప్రమాదాల ద్వారా వారి కుటుంబం రోడ్డున పడుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా , జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష లు అన్నారు. సోమవారం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తానాబాద్ పోలీస్, గర్రెపల్లి గ్రామంలో సర్పంచ్ వీరగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా నిర్వహించిన అరైవ్ – అలైవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష హాజరయ్యారు,
సిపి మాట్లాడుతూ…ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించి నేరాలను నియంత్రించాలని కోరారు. రోడ్డు దాటేటప్పుడు కచ్చితంగా నిబంధనలను పాటించాలని, రోడ్లు దాటేటప్పుడు విధిగా వాహనాలను గమనించాలని సూచించారు. చిన్న పొరపాటు చేసిన అది ప్రాణానికే ప్రమాదం అని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చునని సూచించారు. మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని పేర్కొన్నారు. రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని హెచ్చరించారు. ప్రతి ఇంటిలో పిల్లలకు రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గర్రెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కమిటీని సి పి అభినందించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ…రోడ్డు ప్రమాదం లో గాయాలపాలై అంగవైకల్యం చెందిన లేదా మరణించిన ఆ కుటుంబం వారిపై ఆధారపడి ఉంటే వారు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.
ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్ ను సద్వినియోగం చేసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చని పేర్కొన్నారు. హిట్ అండ్ రన్ కేసులు , ఇతర రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు ప్రభుత్వం రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో రోజు రోజు కు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుందని అనేకమంది అంగవైకల్యం పొందుతున్నారని మృత్యువాత పడుతున్నారని వారి కుటుంబాలు కష్టాల జీవితాలు అనుభవిస్తున్నారని అన్నారు. ప్రమాదాల నియంత్రణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని సూచించారు. పోలీస్ రవాణా రోడ్డు తదితర శాఖల అధికారులతో సమన్వయం చేస్తున్నామని భద్రత చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గత సంవత్సరం జిల్లాలో సుమారు 30 మంది బాధితులకు ఈ సహాయం అందించినట్లు పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను ఆసుపత్రికి తరలిస్తే పోలీస్ కేసుల్లో చిక్కు కుంటామనే అపోహలు ప్రజల్లో ఉన్నాయని, అలాంటి భయాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించిన వారికి రహ వీర్ పథకం క్రింద రూ.25 వేల ప్రోత్సాహకం అందజేయనున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంట గోల్డెన్ అవర్ గా ఉండి, ఈ సమయంలో సరైన వైద్యం అందిస్తే ప్రాణాలను కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. గోల్డెన్ అవర్ లో చికిత్స అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఈ ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకాలు త్వరలో అమల్లోకి రానున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ భషిరోద్దీన్, ట్రాఫిక్ ఏ.సి.పి.శ్రీనివాస్, సీఐలు సుబ్బారెడ్డి, అనిల్ కుమార్, ఎస్సై చంద్రకుమార్, ఎన్ వి ఐ మధు, సంబంధిత పోలీస్, ట్రాఫిక్, ఎం.వి.ఐ సిబ్బంది, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.











