తొర్పునూరి నేహా శ్రీ ని అభినందించిన చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్ (ప్రజా గొంతుక) :
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన తోర్పునూరి నేహ శ్రీ ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ గ్రూప్ 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించిన నేహా శ్రీ కి అభినందనలు వెలివిరిసాయి.నిరుపేద కుటుంబానికి చెందిన నేహ శ్రీ ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో చదివి రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ నేహశ్రీని పలువురు ఘనంగా సన్మానించి నగదు పారితోషకాలు అందజేసి అభినందించారు.చౌటుప్పల్ చైర్ పర్సన్ మోగదాల పావని రమేష్ గౌడ్ 5000 వేలు , 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ గౌడు 10,000, మొదటి వార్డు కౌన్సిలర్ కోసం రాకేష్ రెడ్డి 5000 వేలు గౌడ సంఘం ప్రతినిధులు 10,000, ఓరగంటి ఎట్టయ్య అంజమ్మ ఫౌండేషన్ చైర్మన్ వరగంటి శ్రీనివాస్ గౌడ్ 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.నేహ శ్రీ విద్యలో మరింత ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశించారు. ఈ కార్యక్రమాలలో పలువురు నాయకులు పాల్గొన్నారు.











