*కందుకూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలు*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 14:)*
*రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల పరిధిలోని చౌరస్తాలో మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించడం జరిగింది ఈ కార్యక్రమానికి బిజెపి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి పాల్గొని మాట్లాడుతూ భారతీయ సమాజానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయం అని భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యాంగ వర్ధిల్లడం వెనుక అంబేద్కర్ కృషి ఉందని తెలియజేశారు ఆ మహనీయుని ఆశయాలకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్మటి దేవేందర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ముదిరాజ్ జిల్లా మీడియా సెల్ కన్వీనర్ సాధన మల్లారెడ్డి సీనియర్ నాయకులు చిట్టా రాజేందర్ రెడ్డి ఎగ్గిడి సత్తయ్య బక్క మల్లేష్ ప్రధాన కార్యదర్శులు చిలకల రఘునందన్ గౌర ప్రభాకర్ సురసాని భూమి రెడ్డి ప్రజాప్రతినిధులు రమేష్ నరేష్ అచ్చన పాండు కళ్లెం సుధాకర్ రెడ్డి కళ్లెం చెన్నారెడ్డి సామల దయాకర్ రెడ్డి నరసింహ నవీన్ మొటే జంగయ్య వడ్డే శ్రీరాములు పేరటి రవి ముదిరాజ్ రాములు మహేష్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు*











