*జాగృతి కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు = కప్పటి పాండురంగారెడ్డి*
*భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు – తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఘనంగా నివాళులు.*
*(ప్రజాగొంతుక మహేశ్వరం ఏప్రిల్ 14:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో కప్పటి.పాండురంగారెడ్డి మాట్లాడుతూ..భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను తెలంగాణ జాగృతి కార్యాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యకమము అనంతరం రాష్ర కార్యదర్సి దూగంట్ల నరేష్, రాష్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాము యాదవ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రామిడి వెంకట్ రెడ్డి మహిళా విభాగం నాయకురాల్లతో కలసి తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు, సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ “ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి దిక్సూచి వంటి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్. కుల నిర్మూలన, సామాజిక సమానత్వం మరియు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి అనన్యం. బాబాసాహెబ్ కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదు, ఆయన యావత్ భారతదేశ గర్వకారణం,” సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడమే అంబేద్కర్ ఆశయం “చదువుకో, సమీకరించు, పోరాడు” అనే నినాదంతో బలహీన వర్గాల్లో ఆయన స్ఫూర్తిని నింపారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాల వల్లే నేడు మనం స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ జాగృతి రాష్ర్ర అధ్యక్షరాలు కవితమ్మ సూచనలతో తెలంగాణ జాగృతి ఎల్లప్పుడూ అంబేద్కర్ సూచించిన సామాజిక న్యాయం మరియు సమానత్వ బాటలో నడుస్తుందని ఆయన స్పష్టం చేశారు. యువత అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచరు కప్పాటి పాండురంగా రెడ్డి తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు











