హజారిగూడెం గ్రామపంచాయతీలోపోషణ పక్వాడ కార్యక్రమం……
పోషక విలువలు గల ఆహారం గురించి తల్లులకు అవగాహన కార్యక్రమం…..
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:15
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండలం హజారిగూడెం గ్రామపంచాయతీలోపోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా హజరిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజారిగూడెం గ్రామ సర్పంచ్ కూన్ రెడ్డి భాస్కర్ రెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎస్ సరిత, తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది తల్లులకు చిరు ధాన్యాలు, ఆకుకూరలు,తృణధాన్యాలు ,మరియు ఎక్కువ పోషక విలువలు ఉండే తక్కువ ఖర్చుతో కూడిన ఆహార పదార్థాలు గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సుజాత అంగన్వాడీ టీచర్లు ఎం విజయలక్ష్మి,జి శ్రీదేవి ,పావని, వి బి కే సూర్యకుమారి పిల్లల తల్లిదండ్రులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు











