పోలీసుల సాయంతో రోడ్డు పనులు కొనసాగింపు
. ప్రజా గొంతుక ఏప్రిల్ 15: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని నేషనల్ హైవే సమీపంలో ఉన్న సూరారం స్టేజ్ వద్ద హైవే విస్తరణ పనులకు సంబంధించిన సమస్యలు వెలుగులోకి వచ్చాయి. సూరారం గ్రామానికి చెందిన కొంతమంది నివాసితులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్లు కోల్పోయినందుకు పరిహారం అందుకున్నప్పటికీ, కొన్ని వ్యక్తిగత తగాదాల కారణంగా ఇళ్లు ఖాళీ చేయడంలో ఆలస్యం చేస్తున్నారు.
హైవే విస్తరణకు అవసరమైన భూమిని ఇప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, నిబంధనల ప్రకారం పూర్తి పరిహారం చెల్లించినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ, ఇంకా(6) ఇండ్లు తొలగించకుండా ఉండటం వల్ల రహదారి పనులకు ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు.
బుధవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఎల్కతుర్తి పోలీసులు, సంబంధిత హైవే అధికారులు ( DBL ఎన్‌హెచ్-563) మరియు ఇంజినీర్లు సూరారం స్టేజ్ వద్దకు చేరుకుని, స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. వారు గ్రామస్తులను పిలిచి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
ఎల్కతుర్తి ఎమ్మార్వో మాట్లాడుతూ, “ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇప్పటికే పూర్తి పరిహారం చెల్లించాం.ప్రభుత్వనిబందనల ప్రకారమే ఇండ్లను కూల్చి వేయడం జరిగింది త్వరగా ఖాళీ చేసి హైవే పనులకు సహకరించాలి. లేకపోతే ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి” అని తెలిపారు.
హైవే నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా, సంబంధిత ఇళ్లను వెంటనే తొలగించి, స్థలాన్ని కాంట్రాక్టర్‌కు హ్యాండోవర్ చేయాలని అధికారులు సూచించారు.
ఈ విషయంపై ఎల్కతుర్తి. సిఐ పులి రమేష్ ఎస్సై ప్రవీణ్ కుమార్ వంగర ఎస్సై దివ్య ఎఎస్సై శంకర్ గ్రామస్తులకు చట్టపరమైన సూచనలు అందిస్తూ, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు.











