*పిఆర్సి అమలు చేయండి లేదంటే ఉద్యమం తప్పదు*
ప్రజా గొంతుక ఏప్రిల్ 17 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:
ఉద్యోగస్తుల న్యాయబద్ధమైన సమస్యలను ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాకపోవడంతో టీజీఈజేఏసీ పిలుపు మేరకు శుక్రవారం ధర్మసాగర్ తాసిల్దార్ కార్యాలయంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. డిప్యూటీ తాసిల్దార్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఏఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, జీపీఓ, వీఆర్ఏలు, ఇతర సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం తాసిల్దార్ సదానందంకు వినతిపత్రం అందజేశారు.ప్రధాన డిమాండ్లు ఇవీ.
జూన్ 2వ తేదీ నాటికి కొత్త పీఆర్సీని అమలు చేయాలి. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నీ వెంటనే చెల్లించాలి. ఉద్యోగుల హెల్త్ కార్డులను తక్షణమే అమలు చేయాలి. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలి. 01/09/2004కి ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేయాలి. పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలి. 61 ఏళ్లు నిండిన వీఆర్ఏల సమస్యలను గత హామీ ప్రకారం పరిష్కరించాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ, ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు చేపట్టాలి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.
ప్రభుత్వం ఇకనైనా స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు..











