నాగపురి కిరణ్ పరామర్శ…
లబ్ధిదారునికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన బెల్లంకొండ సంధ్యకు 30 వేల చెక్కును అందజేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ అందజేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పత్తి ఆగయ్య అనారోగ్యం బారిన పడ్డాడు అని తెలిసి పరామర్శించారు.అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ గ్రామ శాఖ అధ్యక్షులుసానికరాజునుపరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన లైన్ మెన్ తిరుమలరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు మట్టి బాలరాజు, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి ఇస్మాయిల్ షరీఫ్, తమ్మడపల్లి గ్రామ సర్పంచ్ బెజాడి సిద్ధులు,ఉప సర్పంచ్ నాగరాజు, ఇటుకాలపల్లి గ్రామ సర్పంచ్ జెర్రిపోతుల రాజు, సిద్దుల గుట్ట టెంపుల్ మాజీ చైర్మన్ గాలికృష్ణ,గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేకల రమేష్,మధు తదితరులు పాల్గొన్నారు.











