పండుగకు భారీ విరాళం అందించిన ప్రముఖ దాత మల్లవరం వెంకటేశ్వరరెడ్డి….
ఊరును కాపాడుకుంటా… పండుగకు భక్తితో సహాయం అందిస్తా…

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండలం, బోన కొల్లూరు గ్రామంలో అత్యంత వైభవంగా జరగబోతున్న బొడ్రాయి పండుగ (పునః ప్రతిష్టాపన మహోత్సవం) నిమిత్తం రూ. 1,00,000/- (అక్షరాలా లక్ష రూపాయలు) విరాళం గా గ్రామ ఆత్మబంధువు, దాతృత్వానికి మారుపేరు ప్రముఖ దాత మల్లవరం వెంకటేశ్వర రెడ్డి గ్రామ సర్పంచ్ చిక్కుడు కల్పన కృష్ణ గ్రామస్తుల ఆధ్వర్యంలో అందించారు. వాటర్ ప్లాంట్ మరమ్మత్తుల నిమిత్తం 45,000( నలభై ఐదు వేల రూపాయలు) ఎల్లమ్మ గుడి నిర్మాణానికి 20వేల రూపాయలు అందించారు.గ్రామ అభివృద్ధిలో మరియు ప్రజాసేవ, దైవభక్తి కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే వెంకటేశ్వర రెడ్డి కి వారి కుటుంబ సభ్యులకు ఆ గ్రామ దేవత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మల్లవరం వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సహాయం అందించడం ఎంతో సంతోషంగా ఉందని వారు కోరితే ఎప్పుడూ వారి సేవ చేయడానికి ముందు ఉంటానని హామీ ఇచ్చారు. గ్రామ పండుగను అందరూ కలిసికట్టుగా ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని, అందరూ కలిసికట్టుగా ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. దాతను గ్రామ ప్రజలు శాలువాలతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలింపూర్ మాజీ సర్పంచ్ బాల్రెడ్డి, గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చిక్కుడు రవీందర్ ఉపసర్పంచ్ పల్లపు శ్రీనివాస్, వార్డు మెంబర్లు బోదాసు శ్రీనివాస్, చేర్యాల స్వామి, నాయకులు చేర్యాల నారాయణ, బోదాసు రమేష్, బియ్య నరేష్, ముల్లా ఆయాలం, తేలు నరేష్, బోడపట్ల పరశురాములు ,బోదాసు శేఖర్, పల్లపు సిద్ధమ్మ, బోదాసునాగరాజు దయ్యాల కొండయ్య, బోదాసు శివయ్య,కేసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాయకులు బందెలరాజు, బాలరాజు గౌడ్ ,భాస్కర్, తిరుపతి, ప్రశాంత్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.











