దేశాయిపేటలో మెగా వైద్య శిబిరం 235 మందికి పరీక్షలు
–టీ.బీ.ముక్తి భారత్ అభియాన్ 2వ విడతలో భాగంగా ఏర్పాటు
ప్రజా గొంతుక ఏప్రిల్ 22 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:
వరంగల్ నగరంలోని దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం టీ.బీ.ముక్తి భారత్ అభియాన్ రెండో విడతలో భాగంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డా. టి. భరత్ కుమార్ మాట్లాడుతూ అలసట,తలనొప్పి, జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఆకలి మందగించడం వంటి క్షయ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి వైద్య సేవలు పొందాలని సూచించారు. ప్రతి ఒక్కరూ క్షయ వ్యాధి చికిత్స, నివారణపై అవగాహన కలిగి ఉండాలన్నారు.వైద్య శిబిరంలో 235 మందికి రక్త పూత పరీక్షలు నిర్వహించగా, అందులో 104 మందికి డిజిటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫుల్లీ కంప్యూటర్ చెస్ట్ ఎక్స్రే పరీక్షలు చేశారు.ఈ కార్యక్రమంలో టీ.బీ నియంత్రణ విభాగం ప్రతినిధులు నరేష్, రంజిత్, సూపర్వైజర్ పబ్లిక్ హెల్త్ మేనేజర్ జన్ను కొర్నేల్, ఫార్మసీ ఆఫీసర్ ఎస్. అనిల్ కుమార్, అకౌంటెంట్ స్వర్ణలత, ఏ.ఎన్.ఎం.లు జ్యోతి, శోభ, అమృత, నిహారిక, సుల్తానా, కాల్వల కుమార్, ఆశ కార్యకర్తలు సుమలత, పరిమళ, గీత, సంధ్య, మమత, పూలమ్మ, శ్రీవాణి, ఆడెపు జ్యోతి, జన్ను బుచ్చయ్య, మేధా నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు….











