E-PAPER

భూమిని కాపాడుకోవాలి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

భూమిని కాపాడుకోవాలి

23 Apr 2026, 7:00 pm DISHA POWER

భూమిని కాపాడుకోవాలి

పత్తిపాక శివారులో మొక్కలు నాటి భూమి దినోత్సవాన్ని జరుపుకున్న ప్రకృతి ప్రేమికులు

 

ప్రజా గొంతుక ప్రతినిధి / శాయంపేట(ఏప్రిల్23):

ఒకవైపు భూతాపం పెరుగుతుంటే.. మరోవైపు మనిషి స్వార్థం పచ్చని ప్రకృతిని, పురాతన గుట్టలను మింగేస్తోంది. ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక శివారులో సహజ వనరుల పరిరక్షణ వేదిక ప్రతినిధి, రైతు పల్లెబోయిన సుధాకర్ పొలంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్, సహజ వనరుల పరిరక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు రాజేందర్ దామెర (దారా) ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానిక గుట్టల విధ్వంసంపై ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. స్థానిక క్రషర్ల వల్ల జరుగుతున్న నష్టాన్ని ఎండగట్టారు. సుధాకర్ పొలం పరిసరాల్లో ఉన్న ఒక భారీ గుట్ట ఇప్పటికే స్టోన్ క్రషర్ల ధాటికి కనుమరుగైపోవడంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం లాభాపేక్షతో ప్రకృతి సంపదను కొల్లగొడుతూ, పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం మరో గుట్టను కూడా క్రషర్ల పాలు చేసేందుకు సన్నాహాలు జరుగుతుండటంపై పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. "గుట్టలు పర్యావరణానికి రక్షణ కవచాలని, క్రషర్ల పేరుతో వాటిని నామరూపాలు లేకుండా చేయడం రాబోయే తరాలకు మనం చేసే ద్రోహమని అన్నారు. పచ్చని చెట్లు నాటడం ఎంత ముఖ్యమో, ఉన్న ప్రకృతి సంపదను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం" అని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించబడుతున్న స్టోన్ క్రషర్ పై విచారణ జరుపాలని, మరో గుట్ట విధ్వంసానికి జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. గుట్టల విధ్వంసానికి వ్యతిరేకంగా, ప్రకృతికి ప్రాణం పోసేలా సుధాకర్ తన పొలంలో మొక్కలు నాటి భూమి దినోత్సవానికి అర్థం చేకూర్చారని రాజేందర్ అన్నారు. "చెట్లు నాటండి - భూమిని రక్షించండి" అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, ప్రకృతి ప్రేమికులు పాల్గొని, తమ పరిసరాల్లోని సహజ వనరులను కాపాడుకుంటామని ప్రతిన బూనారు. ఈ కార్యక్రమంలో పల్లెబోయిన సుధాకర్, అన్నెబోయిన రాజారాం, మొగ్గం సుమన్, కొంగర విజయ్ ప్రకాశ్, పరమాండ్ల ప్రమోద్ తదితరులు పాల్లొన్నారు.

Generating image…

భూమిని కాపాడుకోవాలి

* పత్తిపాక శివారులో మొక్కలు నాటి భూమి దినోత్సవాన్ని జరుపుకున్న ప్రకృతి ప్రేమికులు

 

ప్రజా గొంతుక ప్రతినిధి / శాయంపేట(ఏప్రిల్23):

ఒకవైపు భూతాపం పెరుగుతుంటే.. మరోవైపు మనిషి స్వార్థం పచ్చని ప్రకృతిని, పురాతన గుట్టలను మింగేస్తోంది. ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక శివారులో సహజ వనరుల పరిరక్షణ వేదిక ప్రతినిధి, రైతు పల్లెబోయిన సుధాకర్ పొలంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్, సహజ వనరుల పరిరక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు రాజేందర్ దామెర (దారా) ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానిక గుట్టల విధ్వంసంపై ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. స్థానిక క్రషర్ల వల్ల జరుగుతున్న నష్టాన్ని ఎండగట్టారు. సుధాకర్ పొలం పరిసరాల్లో ఉన్న ఒక భారీ గుట్ట ఇప్పటికే స్టోన్ క్రషర్ల ధాటికి కనుమరుగైపోవడంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం లాభాపేక్షతో ప్రకృతి సంపదను కొల్లగొడుతూ, పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం మరో గుట్టను కూడా క్రషర్ల పాలు చేసేందుకు సన్నాహాలు జరుగుతుండటంపై పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. “గుట్టలు పర్యావరణానికి రక్షణ కవచాలని, క్రషర్ల పేరుతో వాటిని నామరూపాలు లేకుండా చేయడం రాబోయే తరాలకు మనం చేసే ద్రోహమని అన్నారు. పచ్చని చెట్లు నాటడం ఎంత ముఖ్యమో, ఉన్న ప్రకృతి సంపదను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం” అని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించబడుతున్న స్టోన్ క్రషర్ పై విచారణ జరుపాలని, మరో గుట్ట విధ్వంసానికి జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. గుట్టల విధ్వంసానికి వ్యతిరేకంగా, ప్రకృతికి ప్రాణం పోసేలా సుధాకర్ తన పొలంలో మొక్కలు నాటి భూమి దినోత్సవానికి అర్థం చేకూర్చారని రాజేందర్ అన్నారు. “చెట్లు నాటండి – భూమిని రక్షించండి” అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, ప్రకృతి ప్రేమికులు పాల్గొని, తమ పరిసరాల్లోని సహజ వనరులను కాపాడుకుంటామని ప్రతిన బూనారు. ఈ కార్యక్రమంలో పల్లెబోయిన సుధాకర్, అన్నెబోయిన రాజారాం, మొగ్గం సుమన్, కొంగర విజయ్ ప్రకాశ్, పరమాండ్ల ప్రమోద్ తదితరులు పాల్లొన్నారు.

RaamSee Reporter
dishapower.in

భూమిని కాపాడుకోవాలి

భూమిని కాపాడుకోవాలి

పత్తిపాక శివారులో మొక్కలు నాటి భూమి దినోత్సవాన్ని జరుపుకున్న ప్రకృతి ప్రేమికులు

 

ప్రజా గొంతుక ప్రతినిధి / శాయంపేట(ఏప్రిల్23):

ఒకవైపు భూతాపం పెరుగుతుంటే.. మరోవైపు మనిషి స్వార్థం పచ్చని ప్రకృతిని, పురాతన గుట్టలను మింగేస్తోంది. ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక శివారులో సహజ వనరుల పరిరక్షణ వేదిక ప్రతినిధి, రైతు పల్లెబోయిన సుధాకర్ పొలంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్, సహజ వనరుల పరిరక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు రాజేందర్ దామెర (దారా) ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానిక గుట్టల విధ్వంసంపై ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. స్థానిక క్రషర్ల వల్ల జరుగుతున్న నష్టాన్ని ఎండగట్టారు. సుధాకర్ పొలం పరిసరాల్లో ఉన్న ఒక భారీ గుట్ట ఇప్పటికే స్టోన్ క్రషర్ల ధాటికి కనుమరుగైపోవడంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం లాభాపేక్షతో ప్రకృతి సంపదను కొల్లగొడుతూ, పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం మరో గుట్టను కూడా క్రషర్ల పాలు చేసేందుకు సన్నాహాలు జరుగుతుండటంపై పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. "గుట్టలు పర్యావరణానికి రక్షణ కవచాలని, క్రషర్ల పేరుతో వాటిని నామరూపాలు లేకుండా చేయడం రాబోయే తరాలకు మనం చేసే ద్రోహమని అన్నారు. పచ్చని చెట్లు నాటడం ఎంత ముఖ్యమో, ఉన్న ప్రకృతి సంపదను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం" అని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించబడుతున్న స్టోన్ క్రషర్ పై విచారణ జరుపాలని, మరో గుట్ట విధ్వంసానికి జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. గుట్టల విధ్వంసానికి వ్యతిరేకంగా, ప్రకృతికి ప్రాణం పోసేలా సుధాకర్ తన పొలంలో మొక్కలు నాటి భూమి దినోత్సవానికి అర్థం చేకూర్చారని రాజేందర్ అన్నారు. "చెట్లు నాటండి - భూమిని రక్షించండి" అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, ప్రకృతి ప్రేమికులు పాల్గొని, తమ పరిసరాల్లోని సహజ వనరులను కాపాడుకుంటామని ప్రతిన బూనారు. ఈ కార్యక్రమంలో పల్లెబోయిన సుధాకర్, అన్నెబోయిన రాజారాం, మొగ్గం సుమన్, కొంగర విజయ్ ప్రకాశ్, పరమాండ్ల ప్రమోద్ తదితరులు పాల్లొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!