బచ్చన్నపేట మండల ప్రజలు హై హలర్ట్…
ఈత సరదా తీసిన మరో ప్రాణం..
ఈతకు వెళ్లిన వికలాంగుడు మృతి…


ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండలం, రామచంద్రపురం గ్రామంలో ఈత సరదా మరో ప్రాణం తీసింది. బచ్చన్నపేట మండల కేంద్రంలో ఏనుగుల ప్రశాంత్ అనే వ్యక్తి గల్లంతై ప్రొద్దున అతని శవం దొరికిన తర్వాత, ఈ విషయం మరవకముందే మరో వ్యక్తి రామచంద్రపురం గ్రామంలో చీర కరుణాకర్ అనే వ్యక్తి వికలాంగుడు ఈత కొట్టే క్రమంలో అకస్మాత్తుగా మునిగిపోయి గల్లంతయ్యాడు. ఎంతకు రాకపోవడంతో చనిపోయాడని ప్రజలు తెలియజేశారు. ఇంతవరకు అతని డెడ్ బాడీ బయటకు రాలేదు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం తెలియజేయడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి సాధ్యమైనంతవరకు ఈత బంద్ చేసుకొని జాగ్రత్తగా ఉండాలని మీ ప్రజా గొంతుక న్యూస్ తెలియజేయడం జరుగుతుంది.
Post Views: 2,592











