*కొనసాగుతున్న మేడిగడ్డ మట్టి నమూనా పరీక్షలు కేఎల్ఆర్*

*నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్న లక్ష్మారెడ్డి*
*మండుటెండలో పని చేస్తున్న కాంగ్రెస్ నేత కేఎల్ఆర్*
*(ప్రజా గొంతుక మహేశ్వరం మే 07:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..మేడిగడ్డ పునరుద్ధరణ పనులను నిరంతరం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి, ప్రముఖ పారిశ్రామిక వేత్త కిచ్చెన్నగారి లక్షారెడ్డి. కే ఎల్ ఆర్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో మట్టి నమూనా పరీక్షలు కొనసాగుతున్నాయి. పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పటంతో… ప్రాజెక్ట్ వద్దే మండు టెండలో పని చేస్తున్నారు లక్ష్మారెడ్డి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిన మేడిగడ్డ ప్రాజెక్ట్… నాణ్యతా ప్రమాణాలు లోపించటంతో కూలిపోయింది. మళ్లీ పునరుద్ధరించి తెలంగాణ రైతాంగానికి సాగు నీరందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి భావించారు.
ప్రముఖ సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి పటిష్ట నిర్మాణం కోసం కొద్ది రోజులుగా కాళేశ్వరం – మేడిగడ్డ వద్దే డ్రిల్లింగ్ పనులు చేస్తున్నామని కేఎల్ఆర్ తెలిపారు. మరికొన్ని రోజులు మట్టి నమూనా పరీక్షలు చేస్తామని చెప్పారు. వాటి ఆధారంగా ప్రభుత్వ అనుమతితో మేడిగడ్డ పునరుద్దరణ పనులు చేపడతామని కే ఎల్ ఆర్ ఇండస్ట్రీస్ అధినేత కిచ్చెన్నగారు తెలిపారు.
ఈ విషయాన్ని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు అర్థం చేసుకోవాలని కేఎల్ఆర్ విజ్ఞప్తి చేశారు.











