టెన్త్ లో ప్రతిభ కనబరిచిన జనగాని దీక్షితను అభినందించిన కాంగ్రెస్ నాయకులు..

ప్రజా గొంతుక మే 8, ఎల్కతుర్తి:
పదో తరగతి ఫలితాల్లో సెయింట్ థామస్ అల్టిట్యూడ్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఆల్టిట్యూడ్ పాఠశాల విద్యార్థిని జనగాని దీక్షిత 516 మార్కులు సాధించి మండలంలోని అగ్రస్థాయిలో నిలిచింది. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, గౌడ సంఘం నాయకులు శాలువాతో సత్కరించి అభినందించారు. క్రమశిక్షణ కష్టపడేతత్వం, ఉపాధ్యాయుల కృషి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్ళవచ్చని కాంగ్రెస్ నాయకులు శీలం అనిల్ కుమార్ అన్నారు. జనగాని దీక్షిత తండ్రి రాజు మాట్లాడుతూ సెయింట్ థామస్ ఆల్టిట్యూడ్ విద్యాసంస్థ అధ్యాపక బృందానికి, చైర్మన్ కార్తీక్ రావుకు, నాబిడ్డను ప్రోత్సహించడానికి అభినందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు శనిగరపు వెంకటేశ్ స్వరూప, మార్కెట్ డైరెక్టర్ గోడిశాల రాజయ్య,శ్రీపతి బుచ్చి రాములు, ప్రకాష్ గౌడ్,మొదటి వార్డు నెంబర్ సాహూ, కాంగ్రెస్ యువ నాయకుడు గోడిశాల అర్జున్, గోడిశాల వినయ్, కోరేపున్నం, కడారి సురేందర్,గౌడ సంఘం అధ్యక్షుడు గోడిశాల కుమారస్వామి, క్యాషియర్ శ్రీపతి సదానందం, కళ్ళు గీత కార్మిక మండల అధ్యక్షుడు జనగాని లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి బత్తిని శ్రీనివాస్, గౌడ సంఘ నాయకులు జనగాని సురేష్, సీనియర్ జర్నలిస్టు కిష్టయ్య, ఆంధ్రప్రభ జర్నలిస్ట్ జనగాని ప్రవీణ్ గౌడ్, వీడియో జర్నలిస్టు కందుకూరి మహేష్ చారి తదితరులు పాల్గొన్నారు.











