నిరుపేద ప్రజల ఆపద బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి… సీఎంఆర్ చెక్కు అందచేత…
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్
ప్రజా గొంతుక మద్దూరు మండలం
జనగామ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రములో మద్దూరు, సలాకపూర్ గ్రామాల నిరుపేదలకు1,35,000( లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు) విలువైన CMRF చెక్కులను లబ్ధిదారులకు మద్దూరు మండల కేంద్రములో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ CMRF చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ CMRF చెక్కులు మంజూరు చేయించిన నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ కి,గౌరవ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మద్దూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు షౌకత్ భాయ్,కొమురవెల్లి దేవస్థానం మాజీ డైరెక్టర్ కామిడి రమణారెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు బంగ్లా సుధాకర్ రెడ్డి,బూర్గు రాజు,బోయిని రాంబాబు,లక్కపల్లి సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ నీరటి కిషోర్, MD మౌలానా నీరటి కిరణ్, దామెరకుంట శ్రీకాంత్,నీల నవీన్, చింటు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.











