ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండలం, బసిరెడ్డిపల్లి గ్రామంలో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం బండ కింది నరసింహులు కొడుకు బండ కింది చందు ను పనిచేసుకొని బ్రతుకు కొడకా భవిష్యత్తు ఉంటుందని తండ్రి మందలించినందుకు మనస్థాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి ఎస్సై శ్రీకాంత్ కానిస్టేబుల్ లు వెళ్లి పంచనామ చేసి, పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ యువత ఆవేశానికి గురికాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, ఒక ఆవేశమైన నిర్ణయం కుటుంబాలను ఆవేదనకు, తీవ్ర దుఃఖానికి గురి చేస్తాయని, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.
Post Views: 599











