పెంచిన పెట్రోల్ , డిజిల్ ధరలు సామాన్యులపై భారం పడకుండా చూడాలి – సంగెం రమేష్.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్), 15 మే 2026.మే 15 , 2026 నాటినుండి దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్ కు రూపాయలు 3 కంటే ఎక్కువగా పెరిగాయి. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు , అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్ తో సహా ప్రధాని నగరాల్లోని పెట్రోల్ బంకులపై దీని ప్రభావం పడనుంది. పెరిగిన డీజిల్ ,పెట్రోలు ధరలు సామాన్యులపై భారం కాకుండా చూడాలని, ప్రభుత్వానికి వినతి చేశారు.సామాన్యులపై భారం పడకుండా చూడాలని ,రాష్ట్రంలో, దేశంలో కేంద్ర సర్కారు డీజిల్ పెట్రోల్ పై పెంచిన ధరలను తగ్గించి సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘం రమేష్ అన్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకోవాలని వివరించారు.ఈ కార్యక్రమంలో చెన్నారావుపేట మండల అధ్యక్షులు మంద నరేష్ ,ప్రధాన కార్యదర్శి నూనె తిలక్, నెక్కొండ మండల అధ్యక్షులు కారు స్వామి తదితరులు పాల్గొన్నారు.











