ఘనంగా మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడి కుమారుడి పుట్టినరోజు వేడుకలు…
ఆశీర్వదించిన జిల్లా ఉపాధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి….
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు వంచ వెంకట్ రెడ్డి కుమారుడి పుట్టినరోజు వేడుకలు కొన్నే గ్రామంలో ఘనంగా జరిగాయి. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నూకల బాల్రెడ్డి ఆశీర్వదించారు. బంధువులందరి సమక్షంలో కేక్ కటింగ్ చేసిపుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడి ఆశీస్సులతో ఎన్నెన్నో పుట్టినరోజు వేడుకలు సంతోషంగా జరుపుకోవాలి అని జీవితంలో అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేరాలి అని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జిల్లా సందీప్, పట్టణ అధ్యక్షుడు కోడూరి మహాత్మా చారి, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ లింగాల రాజేందర్ రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గని గౌడ్, నాయకులు అరవింద్ రెడ్డి, బల్లపు యాదగిరి,నీల రమేష్,బొట్టు గణపతి, పాకాల చిరంజీవి,బోడపట్ల ఐలయ్య, కొండ హరికృష్ణ, ఆంజనేయులు గౌడ్, భాస్కర్, సోషల్ మీడియా కన్వీనర్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు.











