*నూతన వధూవరులకు ఆశీస్సులు అందించిన వస్కుల శంకర్
ప్రజా గొంతుక మే 19 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని కెఆర్ గార్డెన్స్, ఉప్పుగల్ రోడ్డులోని పామునూరు గ్రామానికి చెందిన సుప్రీంకోర్టు అడ్వకేట్ కలకొల్ల అనిల్ తమ్ముడు కలకొల్ల అరుణ్ – హర్షిత వివాహ రిసెప్షన్ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 46వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ వస్కుల శంకర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి దాంపత్య జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో 46వ డివిజన్ అధ్యక్షుడు వస్కుల నాగరాజు, యువజన కాంగ్రెస్ నాయకులు భైరపాక వేణు, బత్తుల సుమన్, పసునూరి ప్రశాంత్, సీనియర్ నాయకులు బొజ్జ శ్రీనివాస్, వస్కుల వెంకటస్వామి, సింగారపు రాజు, మాడుగుల శ్రీకాంత్, వస్కుల మధు, రాశమోళ్ల చిన్నరాజు తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు…











