*అనారోగ్య బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులు*
–ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా రూ.3.75 లక్షల ఆర్థిక సాయం
ప్రజా గొంతుక మే 20 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:
వేలేరు మండల కేంద్రానికి చెందిన దాసరి కుమారస్వామి గారి కుమారుడు దాసరి లక్ష్మణ్, ఇప్పలపల్లి రజిత గారి కుమారుడు అన్వేష్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి దృష్టికి వచ్చింది.ఈ విషయాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా దాసరి లక్ష్మణ్‌కు రూ.2,50,000, ఇప్పలపల్లి అన్వేష్‌కు రూ.75,000 మొత్తంగా రూ.3,75,000 విలువైన ఎల్ వో సి చెక్కులను కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సర్పంచ్ బిల్లా యాదగిరికి కృతజ్ఞతలు తెలిపారు…











