టిప్పర్ ఢీకొట్టడంతో యువకుడు మృతి.
ప్రజా గొంతుక న్యూస్ సుల్తానాబాద్ రిపోర్టర్ నూక రాందాసు

బుధవారం రోజున మధ్యాహ్నం సమయంలో ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన కోట నిరంజన్ రెడ్డి తన బైక్ పై నాంసానిపల్లి గ్రామ వాసి అయినటువంటి పోతుగంటి రాజుతో ఇద్దరు కలిసి బైక్ పై కరీంనగర్ వెళుతుండగా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి ఎస్సారెస్పీ కెనాల్ దగ్గరికి చేరుకునేసరికి కరీంనగర్ వైపు వెళ్తున్నటువంటి బూడిద లోడుతో తో వెళ్తున్నటువంటి టిప్పర్ డ్రైవరు తన వాహనాన్ని అతివేగంగా ఆజాగ్రత్తగా నడిపి వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు కూడా కిందపడగా కోట నిరంజన్ రెడ్డి నడుం పై నుండి లారీ టైర్ ఎక్కడంతో తీవ్ర గాయాలై అంబులెన్స్ లో ఆసుపత్రి చేరుకునేసరికి చనిపోయినాడు. అదేవిధంగా పోతుగంటి రాజుకు చిన్నచిన్న గాయాలు అయినాయి.ఈ విషయంలో మృతుడి భార్య కోట అపర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై చంద్రకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.











