E-PAPER

20 సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుకున్న టేకువనం అగ్నికి ఆహుతి – రైతు మాటూరి విద్యాసాగర్‌ను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

20 సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుకున్న టేకువనం అగ్నికి ఆహుతి – రైతు మాటూరి విద్యాసాగర్‌ను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

29 May 2026, 2:50 pm DISHA POWER

20 సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుకున్న టేకువనం అగ్నికి ఆహుతి – రైతు మాటూరి విద్యాసాగర్‌ను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి : బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్

ప్రజా గొంతుక మే 29, ఎల్కతుర్తి,హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం అరెపల్లి గ్రామానికి చెందిన రైతు మాటూరి విద్యాసాగర్ గత 20 సంవత్సరాలుగా ఎంతో శ్రమించి, కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచుకున్న టేకువనం అగ్నిప్రమాదంలో దగ్ధమవడం అత్యంత బాధాకరమని బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ పేర్కొన్నారు.రైతు మాటూరి విద్యాసాగర్ తన కుటుంబ భవిష్యత్తు కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం రెండు దశాబ్దాల పాటు టేకు మొక్కలను పెంచి పెద్ద వనంగా తీర్చిదిద్దారని, అయితే ఒక్క అగ్నిప్రమాదంతో ఆ కష్టం మొత్తం బూడిద కావడం దురదృష్టకరమన్నారు. చెట్ల పెంపకానికి రైతు చేసిన కృషి అభినందనీయమని, అటువంటి రైతుకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ అగ్నిప్రమాదం వల్ల రైతుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని, అంతేకాకుండా పర్యావరణానికి కూడా తీరని నష్టం జరిగిందని తెలిపారు. ఎన్నో సంవత్సరాల పాటు సంరక్షించిన వందలాది టేకు చెట్లు అగ్నికి ఆహుతి కావడంతో రైతు తీవ్ర మనోవేదనకు గురయ్యారని అన్నారు.జిల్లా కలెక్టర్, అటవీ శాఖ అధికారులు మరియు సంబంధిత శాఖల అధికారులు వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించి పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు. రైతు మాటూరి విద్యాసాగర్‌కు ప్రత్యేక నష్టపరిహారం ప్రకటించి, తిరిగి టేకు మొక్కల పెంపకానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.రైతుల కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలని, ప్రకృతి సంపదను కాపాడేందుకు కృషి చేస్తున్న రైతులకు భరోసా కల్పించాలని శ్రీకాంత్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.

Generating image…

*20 సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుకున్న టేకువనం అగ్నికి ఆహుతి – రైతు మాటూరి విద్యాసాగర్‌ను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి : బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్*

ప్రజా గొంతుక మే 29, ఎల్కతుర్తి,హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం అరెపల్లి గ్రామానికి చెందిన రైతు మాటూరి విద్యాసాగర్ గత 20 సంవత్సరాలుగా ఎంతో శ్రమించి, కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచుకున్న టేకువనం అగ్నిప్రమాదంలో దగ్ధమవడం అత్యంత బాధాకరమని బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ పేర్కొన్నారు.రైతు మాటూరి విద్యాసాగర్ తన కుటుంబ భవిష్యత్తు కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం రెండు దశాబ్దాల పాటు టేకు మొక్కలను పెంచి పెద్ద వనంగా తీర్చిదిద్దారని, అయితే ఒక్క అగ్నిప్రమాదంతో ఆ కష్టం మొత్తం బూడిద కావడం దురదృష్టకరమన్నారు. చెట్ల పెంపకానికి రైతు చేసిన కృషి అభినందనీయమని, అటువంటి రైతుకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ అగ్నిప్రమాదం వల్ల రైతుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని, అంతేకాకుండా పర్యావరణానికి కూడా తీరని నష్టం జరిగిందని తెలిపారు. ఎన్నో సంవత్సరాల పాటు సంరక్షించిన వందలాది టేకు చెట్లు అగ్నికి ఆహుతి కావడంతో రైతు తీవ్ర మనోవేదనకు గురయ్యారని అన్నారు.జిల్లా కలెక్టర్, అటవీ శాఖ అధికారులు మరియు సంబంధిత శాఖల అధికారులు వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించి పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు. రైతు మాటూరి విద్యాసాగర్‌కు ప్రత్యేక నష్టపరిహారం ప్రకటించి, తిరిగి టేకు మొక్కల పెంపకానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.రైతుల కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలని, ప్రకృతి సంపదను కాపాడేందుకు కృషి చేస్తున్న రైతులకు భరోసా కల్పించాలని శ్రీకాంత్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.

Disha Power Editor
dishapower.in

20 సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుకున్న టేకువనం అగ్నికి ఆహుతి – రైతు మాటూరి విద్యాసాగర్‌ను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

20 సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుకున్న టేకువనం అగ్నికి ఆహుతి – రైతు మాటూరి విద్యాసాగర్‌ను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి : బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్

ప్రజా గొంతుక మే 29, ఎల్కతుర్తి,హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం అరెపల్లి గ్రామానికి చెందిన రైతు మాటూరి విద్యాసాగర్ గత 20 సంవత్సరాలుగా ఎంతో శ్రమించి, కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచుకున్న టేకువనం అగ్నిప్రమాదంలో దగ్ధమవడం అత్యంత బాధాకరమని బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ పేర్కొన్నారు.రైతు మాటూరి విద్యాసాగర్ తన కుటుంబ భవిష్యత్తు కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం రెండు దశాబ్దాల పాటు టేకు మొక్కలను పెంచి పెద్ద వనంగా తీర్చిదిద్దారని, అయితే ఒక్క అగ్నిప్రమాదంతో ఆ కష్టం మొత్తం బూడిద కావడం దురదృష్టకరమన్నారు. చెట్ల పెంపకానికి రైతు చేసిన కృషి అభినందనీయమని, అటువంటి రైతుకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ అగ్నిప్రమాదం వల్ల రైతుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని, అంతేకాకుండా పర్యావరణానికి కూడా తీరని నష్టం జరిగిందని తెలిపారు. ఎన్నో సంవత్సరాల పాటు సంరక్షించిన వందలాది టేకు చెట్లు అగ్నికి ఆహుతి కావడంతో రైతు తీవ్ర మనోవేదనకు గురయ్యారని అన్నారు.జిల్లా కలెక్టర్, అటవీ శాఖ అధికారులు మరియు సంబంధిత శాఖల అధికారులు వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించి పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు. రైతు మాటూరి విద్యాసాగర్‌కు ప్రత్యేక నష్టపరిహారం ప్రకటించి, తిరిగి టేకు మొక్కల పెంపకానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.రైతుల కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలని, ప్రకృతి సంపదను కాపాడేందుకు కృషి చేస్తున్న రైతులకు భరోసా కల్పించాలని శ్రీకాంత్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!