బచ్చన్నపేటలో ముమ్మరంగా ఓటరు జాబితా సవరణ: ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ చేసిన బి ఎల్ ఓ లు

ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి: తహశీల్దార్ హుస్సేన్
దిశ పవర్, బచ్చన్నపేట:మండలంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా బూత్ స్థాయి అధికారులు మండలంలోని గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారమ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ హుస్సేన్ బిఎల్‌ఓలకు పలు కీలక సూచనలు చేశారు.ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన ఓటర్లందరికీ ఫారమ్‌లు అందజేయాలని, వారి వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా ఖచ్చితంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఈ ఫారమ్‌ల ప్రాముఖ్యతను వివరించి, నిర్ణీత గడువులోగా వాటిని పూర్తి చేసి సమర్పించేలా అవగాహన కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ శంకర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వంశీ కృష్ణ, మున్వార్, జీపీఓ సూర్య ప్రకాశ్, మరియు బీఎల్‌ఓలు స్వప్న, రాజు, మానస, యాదలక్ష్మి, సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.











