బచ్చన్నపేట కాంగ్రెస్ రథసారథిగా మహమ్మద్ మసూద్: మండలానికి సరికొత్త జోష్!
కొడవటూరు సిద్ధేశ్వర ఆలయ డైరెక్టర్ చిక్కుడు మల్లేశం ప్రత్యేక అభినందనలు
మండలవ్యాప్తంగా మిన్నంటిన కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు, బాణసంచా పేల్చి మిఠాయిల పంపిణీ
దిశా పవర్,బచ్చన్నపేటబచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నాయకులు, ఉద్యమశీలి మహమ్మద్ మసూద్ నియామకం కావడం పట్ల స్థానిక రాజకీయ వర్గాల్లో సరికొత్త ఉత్సాహం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ మేరకు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బచ్చన్నపేట మండలవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు పండగ వాతావరణాన్ని తలపిస్తూ ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. మసూద్ నియామకం మండలంలో కాంగ్రెస్ బలోపేతానికి తిరుగులేని పునాది వేస్తుందని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
మహమ్మద్ మసూద్‌కు కొడవటూరు ఆలయ డైరెక్టర్ చిక్కుడు మల్లేశం హర్షం:
మసూద్ నియామక వార్త వెలువడగానే కొడవటూరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ కమిటీ డైరెక్టర్ చిక్కుడు మల్లేశం ప్రత్యేకంగా స్పందిస్తూ నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. “గత కొన్ని దశాబ్దాలుగా మసూద్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్నారు. ఉన్నత విద్యావంతుడైన మసూద్, తన విద్యార్థి దశ నుండే ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ వేదికగా ఎన్నో ప్రజాపోరాటాలు నిర్వహించారు. నిరంతరం నిస్వార్థంగా సేవలందిస్తూ, కార్యకర్తలకు అండగా నిలిచే వ్యక్తికి ఈరోజు మండల పార్టీ రథసారథ్యం దక్కడం నిజంగా గర్వకారణం” అని కొనియాడారు.
కార్యకర్తలకు దక్కిన గౌరవం – పార్టీ బలోపేతం ఖాయం:
మండల స్థాయిలో ప్రతి గ్రామంలోనూ తిరుగుతూ కాంగ్రెస్ జెండాను నిలబెట్టిన మసూద్‌కు పదవి దక్కడం కార్యకర్తలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని చిక్కుడు మల్లేశం పేర్కొన్నారు. యువతను మరియు సీనియర్లను సమన్వయం చేసుకుంటూ బచ్చన్నపేట మండలంలో కాంగ్రెస్ విజయకేతనాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లే సత్తా మసూద్‌కే ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో మరిన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ, ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.











