దిశ పవర్ బచ్చన్నపేట మండలం జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, విశేషాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ నియోజకవర్గానికి ఆరోగ్య ప్రదాతగా, విద్యా ప్రదాతగా, అభివృద్ధి ప్రదాతగా ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు. స్వామివారి ఆశీస్సులతో ఆయన ప్రజాసేవను మరింత సమర్థవంతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీల కవితమురళి, ఉపసర్పంచ్ గంగం దయాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కరికె కరుణాకర్, కందారం కనుకచారి, ఏసబోయిన బాలసిద్ధులు, మినలాపురం శివకుమార్, మినలాపురం రాజు, గుజ్జుక ప్రసన్నకుమార్, ఆత్కూరి నాగరాజు, కందారం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.











