E-PAPER

దేశాయ్ బీడీ కంపెనీని దుద్దెడకు తరలించొద్దంటూ కార్మికుల రిలే నిరాహార దీక్ష

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

దేశాయ్ బీడీ కంపెనీని దుద్దెడకు తరలించొద్దంటూ కార్మికుల రిలే నిరాహార దీక్ష

04 Aug 2026, 12:48 pm DISHA POWER

దిశ పవర్ బచ్చన్నపేట, ఆగస్టు 4:గత 40 సంవత్సరాలుగా బచ్చన్నపేటలో కొనసాగుతున్న దేశాయ్ బీడీ తయారీ కంపెనీని దుద్దెడకు తరలించవద్దని డిమాండ్ చేస్తూ కార్మికులు మంగళవారం రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. కంపెనీని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వందలాది కుటుంబాల ఉపాధికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ, సుమారు 800 మంది బీడీ కార్మికులు, 20 మంది ప్యాకింగ్ కార్మికులు ఈ కంపెనీపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. కంపెనీని ఇతర ప్రాంతానికి తరలిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.నాలుగు దశాబ్దాలుగా బచ్చన్నపేటలో కొనసాగుతున్న కంపెనీని యథాతథంగా ఇక్కడే కొనసాగించాలని, కార్మికుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని యాజమాన్యం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని కంపెనీ తరలింపును నిలిపివేయాలని కోరారు.ఈ రిలే నిరాహార దీక్షలో నర్రా రవీందర్ రెడ్డి, దమ్ము మహేందర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్, నర్రా సురేందర్ రెడ్డి, మేక యాదగిరి, వంగ మల్లారెడ్డి, మార్క సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!