దిశ పవర్ బచ్చన్నపేట మండలం,పోచన్నపేట గ్రామంలో నిర్వహిస్తున్న ‘గుడ్ మార్నింగ్ పోచన్నపేట’ కార్యక్రమంలో భాగంగా సోమవారం సర్పంచ్, ఎంపీపీ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక వసతులు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, భోజనం నాణ్యత, మెనూ తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు, చిన్నారులతో మాట్లాడి వారి చదువు, ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలపై ఆరా తీశారు.అదే సమయంలో పాఠశాల పరిసరాల్లో ప్రమాదకరంగా ఉన్న చెట్టును గుర్తించి, విద్యార్థుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని సర్పంచ్ ఎండి ఫిరోజ్ తెలిపారు.విద్యార్థుల భద్రత, విద్యా ప్రమాణాలు, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ‘గుడ్ మార్నింగ్ పోచన్నపేట’ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.











