శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

చౌటుప్పల్ (ప్రజా గొంతుక) :
చౌటుప్పల్ మండలం, దేవలమ్మ నాగవరం గ్రామం లో
శ్రీ సీతారామచంద్ర స్వామి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు 19.3.2026 నుండి 29.3.2026 వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవ బ్రాహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ,స్వామి వారి కళ్యాణ ఆహ్వాన పత్రికలను దేవాలయ కమిటీ ,ఉత్సవ కమిటీ, బాలభక్త సమాజం కమిటీ గ్రామ ప్రముఖుల, భక్తుల ఆధ్వర్యజంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వానం పత్రికలను ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని దేవాలయ కమిటీ అధ్యక్షులు పన్నాల రాజురెడ్డి తెలిపారు.స్వామి వారి కళ్యాణ మహోత్సవం 27.3.2026 శుక్ర వారం రోజున ఉదయం 11.45 నిమిషాలకు నిర్వహించడం జరుగుతుందని స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని రాజు రెడ్డి కోరారు.











