8 వ వార్డు సమస్యలపై తక్షణమే స్పందించిన కౌన్సిలర్ సలహాదారు…… మజహార్ మోహినుద్దీన్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:27
హాలియా మున్సిపాలిటీ స్థానిక 8 వ వార్డులో వార్డు కౌన్సిలర్ సలహాదారు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మజహర్ మొహియుద్దీన్ పారిశుధ్యం పనులు పరిశీలించి మురికి కాలువలలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలిగించాలని పారిశుధ్య కార్మికులకు తెలియపరుస్తూ ఉపయోగంలో లేని (అన్ యూజ్డ్)ఇంటింటికి మిషన్ భగీరథ నల్లాలను ట్యాప్ లు బిగించమని వాటర్ సప్లై వాచర్ ను ఆదేశించడంతో పాటుగా స్థానిక వార్డు ప్రజలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి రోజు చెత్త వాహనం లోనే చెత్తనువేయాలని మురికి కాలువలలో కవర్లు వేయరాదని సూచించడం జరిగినది ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు ప్రజలు పాల్గొనడం జరిగింది
Post Views: 39











