వేద మంత్రాల మధ్య సీతారాముల కళ్యాణం
ప్రజా గొంతుక మార్చి 27 కాజీపేట మండల ప్రతినిధి:
కాజీపేట మండల కేంద్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించారు. కాజీపేట రైల్వే క్వార్టర్స్‌లోని దేవాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు కుటుంబ సమేతంగా హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజారులు కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి భాగ్యలక్ష్మి దంపతులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సీతారాముల ఆశీస్సులు పొందారు.
Post Views: 41











