ఏప్రిల్ 14 న డాక్టర్ అంబేద్కర్ జయంతి సభను విజయవంతం చేయగలరు……
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:మార్చి:28
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం 26 శనివారం నాడు హాలియా పట్టణ కేంద్రం ఆర్ అండ్ బి అతిథి గృహంలో నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇంచార్జీ జిల్లా శేఖర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా నేషనల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ బోయిని చంద్ర శేఖర్ ముదిరాజ్,జోన్ చీఫ్ ఇంచార్జీ ప్రభు కుమార్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మంచాల జిల్లా అధ్యక్షులు రావులపాటి రవి శంకర్ హాజరై సభకు బహుజన, అంబేద్కర్ వాదులు అత్యధిక ప్రజలు హాజరై సభను విజయవంతం చేయాలని కోరుతూ సభ గోడపత్రికలు ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు భాషిపాక శివ, నియోజక వర్గ ఇంచార్జీ జిల్లా శేఖర్,లింగాల సైదులు, మామిడి లక్ష్మణ్,గడ్డమీది మహేష్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.











