*నందుపల్లిలో ఉల్లాస్ అమ్మ అక్షరాభ్యాసం ప్రారంభం దేశపాగ నర్సింహా*

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చ్ 29:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని నందు పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ దేశపాగ నరసింహ మాట్లాడుతూ.. మహిళల విద్యాభివృద్ధికి వెలుగునిస్తున్న కార్యక్రమంగా మహిళా సంఘం పరీక్షలు నిర్వహించబడినాయి.ఈ పరీక్షలను గ్రామ సర్పంచ్ నరసింహ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నరసింహ మాట్లాడుతూ… మహిళలు అక్షరాస్యత సాధించడం ద్వారా తమ జీవితాలను మాత్రమే కాకుండా కుటుంబాన్ని కూడా అభివృద్ధి దిశగా నడిపించగలరని అన్నారు. మహిళా సంఘాల్లోని ప్రతి మహిళ అక్షరజ్యోతిగా మారాలని, చదువు ద్వారా అన్ని రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మహిళలు చదువుకుంటే పిల్లల విద్యపై మంచి ప్రభావం ఉంటుందని, కుటుంబంలో విద్యా వాతావరణం ఏర్పడుతుందని ఆమె వివరించారు. మహిళా సాధికారతకు విద్యే ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు కార్యక్రమంలో భాగంగా నందుపల్లి సర్పంచ్ దేశపాగ నర్సింహా ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులకు పరీక్ష నిర్వహించడం జరిగింది ఇందులో ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులు మహిళా సంఘాలు గ్రామ పెద్దలు మరియు యువకులు , వీరాంజనేయులు,వివో అధ్యక్షురాలు వివోఏ పాల్గొనడం జరిగింది











