E-PAPER

తిమ్మాపూర్ గ్రామంలో పంట మార్పిడి పై అవగాహన సదస్సు 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

తిమ్మాపూర్ గ్రామంలో పంట మార్పిడి పై అవగాహన సదస్సు 

31 Mar 2026, 6:07 pm DISHA POWER

తిమ్మాపూర్ గ్రామంలో పంట మార్పిడి పై అవగాహన సదస్సు

రైతులతో శాస్త్రవేత్తల ముఖాముఖి

మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో పంట మార్పిడి విధానంపై రైతులు మరియు శాస్త్రవేత్తల మధ్య ముఖాముఖి కార్యక్రమం నిర్వహించరు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ముప్పు మానస మహేందర్ పాల్గొనగా హన్మకొండ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ సి.హెచ్. రాములు (మృత్తిక శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్) రైతులకు పంట మార్పిడి పై అవగాహన కల్పించారు.

రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్రస్తుతం వరి పంట మాత్రమే గ్యారంటీగా లాభదాయకంగా ఉందని తెలిపారు. ఇతర పంటలు సాగు చేయడానికి ఎక్కువ కార్మికులు అవసరం అవుతారని మార్కెట్ అనిశ్చితి ఉండటంతో ఆర్థికంగా నష్టపోతున్నామని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం హార్వెస్టర్ సౌకర్యం అందుబాటులో ఉండటం వల్ల వరి సాగు సులభమైందని పేర్కొన్నారు.

రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపాలంటే ప్రభుత్వం విత్తనాలు పురుగు మందులపై సబ్సిడీ కనీస మద్దతు ధర మరియు మార్కెట్ సదుపాయాలు కల్పించాలని కోరారు.

శాస్త్రవేత్త డాక్టర్ రాములు మాట్లాడుతూ పంట మార్పిడి వల్ల నేల సారవంతం పెరుగుతుందని నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి పోషకాల లభ్యత మెరుగుపడుతుందని తెలిపారు. వరి తర్వాత ఆరుతడి పంటలు వేసినట్లయితే నేల బలం నిల్వ ఉండటంతో పాటు దిగుబడులు కూడా మెరుగవుతాయని వివరించారు.

సర్పంచి ముప్పు మానస మహేందర్ మాట్లాడుతూ గ్రామంలో వరి పంట దిగుబడులు క్రమంగా తగ్గుతున్నాయని దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి సేంద్రియ ఎరువులు మరియు ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. అలాగే రైతులకు సరైన మార్కెట్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!