మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం ఎకరాకు 40,వేల నష్ట పరిహారం అందివ్వాలి.. మాజీ ఎమ్మెల్యే దాసరి డిమాండ్..
ప్రజా గొంతుక( ఏప్రిల్ 1) కాల్వ శ్రీరాంపూర్: మంగళవారం తెల్లవారుజామున గాలితో కుడిన ఈదురుగాలులు రావడంతో మొక్కజొన్న పంటలు నెలకుఒరోగి తీవ్రంగా నష్టపోయిన పంటలను గురువారం రోజున మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సదాశివరెడ్డి,మాజీ ఎంపీపీ సంపత్ యాదవ్, మాజీ జెడ్పిటిసి తిరుపతి రెడ్డి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో గాలి వానలకు మొక్కజొన్న పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే ఒక ఎకరాకు ₹..40, వేల చొప్పున పంట నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. చేతికి వచ్చిన పంటకు గాలి రావడంతో మొక్కజొన్న పంటలు నేలఒరగా,పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందని, నష్టపోయిన పంటలను పరిశీలించి నష్టపరిహారం తప్పకుండా అందజేయలని, లేనియెడల తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పేరుకే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటుందని రైతును ఆదుకునే దాఖలు లేవని వారు అన్నారు. అన్నదాతల్లో తీవ్ర ఆందోళన ఉన్నారని, ప్రభుత్వం వారిని ఆదుకొని అండగా నిలవాలని తెలిపారు. వారి వెంట వైస్ ఎంపీపీ జూకంటి శిరీష అనిల్,ఉప సర్పంచ్ లోనే సదయ్య, మాజీ సర్పంచ్ జక్కే రవీందర్, ఉల్లి సురేందర్, జెక్కే విష్ణువర్ధన్ గౌడ్, కామిడి వెంకట్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సాగర్ రెడ్డి,వేణుగోపాల్ రెడ్డి పిన్నింటి సంపత్ రెడ్డి,మాతంగి హరీష్,కంది రమేష్, కాసర్ల సదాశివరెడ్డి,రాపర్తి మల్లయ్య, వేల్పుల సంపత్, సతీష్,రఘుపతి రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎర్రబాటి రవి,వోడ్నాల శ్రీనివాస్,మండల యూత్ నాయకుడు కుంభం రాజు,టిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.











