ఆస్తి పన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందగలరు……
హాలియా మున్సిపాలిటీ కమిషనర్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:01హాలియా మున్సిపాలిటీ పరిధిలోని పౌరులందరికీ తెలియజేయునది ఏమనగా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ముందుగా చెల్లించే వారికి ప్రభుత్వం 5% రాయితీను ప్రకటించింది. ఈ రాయితీ 01-04-2026 నుండి 30-04-2026 వరకుమాత్రమే వర్తిస్తుంది.కావున, మున్సిపాలిటీ పరిధిలోని పన్ను చెల్లింపుదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నిర్ణీత కాలవ్యవధిలో తమ ఆస్తి పన్నును చెల్లించి 5% రాయితీని పొందవలసిందిగా మనవి చేయడమైనదిపన్ను చెల్లింపులు సమయానికి జరిగితే మున్సిపాలిటీ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది మరియు పౌరులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, శుభ్రత, వీధి దీపాలు, తాగునీటి సరఫరా వంటి సేవలను మరింత మెరుగ్గా అందించుటకు వీలు కలుగుతుంది.అందువలన, పౌరులందరూ ఈ పథకాన్ని వినియోగించుకొని తమ పన్నులను వెంటనే చెల్లించి, హాలియా మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరడమైనది.మరిన్ని వివరాలకు మున్సిపల్ కార్యాలయాన్ని లేదా సంబంధిత బిల్ కలెక్టర్‌ను సంప్రదించగలరు.











