ప్రజా పాలన — ప్రగతి నివేదిక కార్యక్రమంలో పాల్గొన్న …….
సర్పంచ్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:02నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామములో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమాన్ని గ్రామ ప్రాథమిక పాఠశాల నందు ఏర్పాటు చేయుట జరిగినది ఇట్టి కార్యక్రమానికి ప్రత్యేక అధికారి మండల అభివృద్ధి అధికారి మరియు గ్రామ సర్పంచ్ ఎడవెల్లి వంశీకృష్ణారెడ్డి పాల్గొన్నారు…
తదనంతరం సర్పంచ్ మాట్లాడుతూ
గ్రామసభ లో ప్రతి ఒక్కరు పాల్గొని తమ యొక్క సమస్యలను వ్యక్తపరిస్తే అట్టి సమస్యను గ్రామ అధికారి సమస్యను నోట్ చేసుకొనుట జరుగుతుంది… కనివిని ఎరగని రీతిలో గ్రామంలో గ్రామ సభకు హాజరైన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ… గెలిచే అంతే వరకు పార్టీలు ఉపయోగపడతాయి.ఆ తర్వాత ప్రతి ఒక ప్రజాప్రతినిధి గా ఉన్నవారు గ్రామ అభివృద్ధి కే పాటుపడాలి అప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుందిగ్రామాన్ని అభివృద్ధి చేయడమే నా యొక్క ధ్యేయం.. లక్ష్యం అని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో హాలియా మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సలహాదారులు ఎడవల్లి నరేందర్ రెడ్డి , ఉద్యమ నాయకుడు అంజద్ ఖాన్, ఏఎంసీ మాజీ మార్కెట్ డైరెక్టర్ అక్బర్ ఖాన్, పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ నల్లబోతు వెంకటయ్య యాదవ్,గురు స్వామి పేరూరు గోవిందు గ్రామ వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు..











