ప్రజాపాలనప్రగతిప్రణాళికలో భాగంగా వార్డు సభలోపాల్గొన్నఎమ్మెల్యే, అదనపు కలెక్టర్.
ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల
జోగులాంబగద్వాలజిల్లా ప్రజలకు ప్రభుత్వ సేవలనునేరుగాచేరవేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రజాపాలనప్రగతిప్రణాళికలో భాగంగాగద్వాల పట్టణంలో వార్డు సభ కార్యక్రమంనిర్వహించారు. 99 రోజుల ప్రత్యేక ప్రణాళికలోభాగంగాజరిగిన ఈ సభకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా,హాజరయ్యారు.
ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యేబండ్లకృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగాముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో 99రోజుల ప్రజాపాలనప్రగతిప్రణాళికకార్యక్రమంవిజయవంతంగాఅమలవుతోందన్నారు.
గ్రామాల్లోగ్రామ సభలు, పట్టణాల్లో వార్డు సభల ద్వారా ప్రభుత్వసంక్షేమ పథకాలు,అభివృద్ధికార్యక్రమాలపైప్రజలకుఅవగాహనకల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాలలబ్ధిప్రతిఅర్హుడికిచేరేలాచర్యలుతీసుకుంటున్నామని,ప్రజలతోఎన్నుకోబడినప్రభుత్వం ప్రజలకు నేరుగా సేవలందించడమేలక్ష్యమనిఎమ్మెల్యేపేర్కొన్నారు
ఈ కార్యక్రమంలోఅదనపు కలెక్టర్ నర్సింగరావు కార్యాలయ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.











