రైతన్న మేలుకో ఆరోగ్యాన్ని కాపాడుకో భూమిని కాపాడు -ఆరోగ్యాన్ని సంరక్షించు

ప్రజా గొంతుక ఏప్రిల్ 4:జీలుగుల గ్రామంలో ఉత్తమ పత్తి యాజమాన్య పథకం, ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ నిధి సహకారంతో నవ క్రాంతి రైతు ఉత్పత్తి దారుల సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బీసీఐ మాస్టర్ ఫీల్డ్ ఫెసిలిటేటర్ వంగ,రఘుగారు మాట్లాడుతూ నిషేధిత అత్యంత విషపూరితమైన పురుగుమందులు మనుషుల ఆరోగ్యానికి పర్యావరణానికి అత్యధిక హాని కలిగిస్తాయని, మనుషుల ఆరోగ్యానికి దీర్ఘకాలంలో క్యాన్సర్ కారక జన్యుపరమైన హార్మోనుల్ల పైన ప్రభావం కలిగిస్తాయని భావితరాల పిల్లలలో కూడా శారీరక మానసిక వైకల్యాన్ని కలిగిస్తాయని రైతులు అర్థం చేసుకొని వాటి వాడకం తగ్గించాలని, అలాగే పురుగు మందులు పిచికారి చేసేటప్పుడు తప్పక రక్షణ దుస్తులు(పిపిఈ) ధరించాలని, అనగా ముఖానికి మాస్క్, తలకి హెల్మెట్, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు, కళ్ళకి అద్దాలు, చేతులకు గ్లాజులు, కాళ్ళకి బూట్లు వేసు కొని స్ప్రే చేయాలని, అలాగే ఎరుపు రంగు గుర్తు కలిగినటువంటి మోనో, ఇతర మందులు వాడరాదని, అలాగే పర్యావరణానికి హాని కలిగించే పురుగుమందుల వాడకాన్ని తగ్గించి, కషాయాలు వాడాలని, పురుగు మందులు కొట్టేటప్పుడు రెండు, మూడు రకాల పురుగు మందులుకలిపి కొట్టరాదని, మార్కెట్లో రిజిస్టర్ చేయబడిన పురుగు మందులను కాంబినేషన్ రూపంలో ఉన్న పెస్టిసైడ్స్ వాడాలని, రైతులు, రైతు కూలీలకు కనీస వేతన చట్ట ప్రకారం కూలీ డబ్బులు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, పైన చెప్పిన విషయాలను తప్పక ఆచరిస్తూ తమ ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణను కాపాడాలని, పంట అవశేషాలు నేలలో కలియ దున్నడం వలన భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది, నేలలో పోషకాలు స్థాయి పెరగడం వల్ల కొంత వరకు భూమిలో రసాయన ఎరువులను తగ్గించుకోవచ్చు రైతులు పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకోవడంతోపాటు, వాతావరణ మార్పులును అరికట్టవచ్చని తెలుపరు. అనంతరం గ్రామ రైతులతో కలిసి ర్యాలీ చేస్తూ “రైతన్న మేలుకో -ఆరోగ్యాన్ని కాపాడుకో”. “రసాయనాలు వద్దు- సేంద్రియలు ముద్దు అంటూ నినాదాలు పలకరు. ఈ కార్యక్రమంలో బీసీఐ సిబ్బంది రాజేందర్ మౌనిక లత మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.











